సమగ్ర సలహా వ్యవస్థ

పంట ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచుటలో, సంహిత యొక్క నిపుణుల బృందం ఒక సమగ్ర ప్రణాళిక ప్రకారం సలహాలు మరియు సూచనలను అందించును.

పంట ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచే మా యొక్క సమగ్ర సలహా వ్యవస్థ ఈ క్రింది వాటిని అనుసరించి పనిచేయును

నేల నిర్మాణం యొక్క విశ్లేషణ

పైనేలతో పాటు క్రింది నేల కూడా పంట ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా లోతువేరు వ్యవస్థ కలిగిన పంటలు పండించేటప్పుడు క్రింది నేల గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం చాలా ఉంది. మా వద్ద ఉన్న సాంకేతికతతో ఒక మీటర్ లోతు వరకు క్రిందినేలను పరిశీలించి తగిన సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఈవిధంగా క్రిందినేల వలన కలిగే దుష్ప్రభావాలను కూడా ముందుగానే తెలుసుకోవచ్చును.

నేల మరియు నీటి విశ్లేషణ

నేల మరియు సాగునీటి గుణగణాలు తెలుసుకోకుండా ఏ విధమైన యాజమాన్య పద్ధతులు చేపట్టినా, అవి అసంపూర్ణంగానూ, అసంబద్ధంగాను ఉండును. కాబట్టి నేల మరియు నీటి విశ్లేషణ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇక్కడ నేల మరియు నీటి నమూనాలు సేకరించే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిఉంటుంది. దీనికొరకు సంహిత నందు శిక్షణ పొందిన క్షేత్ర సిబ్బంది ఉంటారు.

నేల మరియు నీటి సంరక్షణ

సుస్థిర వ్యవసాయంలో నేలకోతను నిరోధించుట అనేది మఖ్యమైన అంతర్భాగం. భూగర్భ జలాలు మరియు వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో, నేలలో తేమను కాపాడటం మరియు నేలకోతను నివారించడం తప్పనిసరి. ఈ విషయంలో తగిన సలహాలు, సూచనలు ఇవ్వడంలో సంహిత నిపుణుల బృందం రైతులకు అన్నివేళలా తోడ్పడుతుంది.

వాన నీటి సేకరణ మరియు భూగర్భ జలాల పెంపు

సాధారణంగా తోటలను వర్షాధారంగా లేక భూగర్భ జలాల మీద ఆధారపడి సాగుచేస్తుంటారు. ప్రత్యేకంగా, వేసవి కాలంలో తోటకు సరిపడా నీరందించడం అనేక ప్రాంతాల్లో పెద్ద సమస్యగా మారింది. తగినంత నీరు అందించలేనప్పుడు, పంట యొక్క దిగుబడి మరియు నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేగాకుండా, పూర్తిగా ఎదిగిన చెట్లు క్రమేణా క్షీణించి, చివరకు చనిపోవడం కూడా జరగవచ్చును. సంహిత యొక్క నిపుణులు వర్షపు నీటిని సేకరించుకొనే పద్ధతులు, భూగర్భ జలాల సంరక్షణ గురించి ఎప్పటికప్పుడు రైతులకు తగిన సలహాలు ఇస్తుంటారు.

నేల సారం మరియు పోషక యాజమాన్యం

నేలను ఆరోగ్యంగా మరియు సజీవంగా ఉంచడం సుస్థిర వ్యవసాయంలో ప్రధానమైన అంశం. రసాయనిక ఎరువులు వాడటం అనేది పంట పోషక యాజమాన్యంలో కేవలం ఒక కంటితుడుపు చర్య లాంటిది. కాబట్టి పోషక యాజమాన్యం కన్నా నేలసారం మీద సంహిత బృందం దృష్టి ఎక్కువగా పెడుతుంది.

నీటి తడుల క్రమబద్దీకరణ

తోటలను దీర్ఘకాలంపాటు లాభసాటిగా సాగుచేయాలనుకునే రైతులు ఖచ్చితంగా నీటి తడులు ఇచ్చే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిఉంటుంది. సంహిత నందు, క్షేత్రంలో ఉంచబడిన కొన్ని పరికరాల ద్వారా నేలలో తేమ మరియు వాతావరణ అంశాలను పరిగణనలోకి తీసుకొని, నీటి తడులు ఇచ్చే విషయంలో రైతులకు తగిన సలహాలు ఇవ్వడం జరుగుతుంది.

కలుపు యాజమాన్యం

తగిన జాగ్రత్తలు పాటించకుండా కలుపుమందులను వాడటం వలన, చెట్ల ఎదుగుదల, దిగుబడి, కాయ నాణ్యత దెబ్బతినడమే కాకుండా చెట్లు కూడా క్షీణించే ప్రమాదముంటుంది. కాబట్టి సంహిత నందు, కలుపు మందులకు బదులుగా మల్చింగ్, అంతరకృషి , అంతపంటల సాగు ఇంకా ఇతర ఆధునిక పద్దతులను సూచించడం జరుగును. ఒకవేళ కలుపు మందులు తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితి వస్తే, ఎలాంటి రసాయనాలు వాడాలో, ఎలా వాడాలో అనే విషయాలలో రైతులకు తగిన సలహాలు ఇవ్వబడును.

సమగ్ర సస్య రక్షణ

Samhitha Crop Care Clinics processes a robust pest monitoring system. Trained field staff will systematically scout the orchards at scheduled intervals using mobile apps and report to the Crop Advisors online. Experts will analyze information collected through mobile apps, soil sensors, weather stations, and UAVs to prepare appropriate advice. The advice thus prepared will be delivered to the grower’s mobile as a text message. Growers will also receive regular pest alerts, weather forecasts and notifications on scheduled farm activities on their mobile phones.

క్షేత్రంపై నిరంతర నిఘా

సంహిత యొక్క క్షేత్ర సిబ్బంది క్రమం తప్పకుండ ఒక షెడ్యూల్ ప్రకారం తోటలను సందర్శించును. దీనివలన రైతులు, వారికున్న పంట సమస్యలకు సకాలంలో నివారణ చర్యలు చేపట్టుటకు అవకాశం ఉంటుంది. రైతులు కోరుకున్నచో నిపుణులు కూడా క్షేత్ర సందర్శన చేయుదురు. కానీ ఈ సందర్శన ఖర్చులను రైతులే భరించవలసి ఉంటుంది. 

తోట ఆరోగ్య పత్రం

Orchard health card is the most unique report generated based on the data meticulously collected about the problems related to soil fertility, irrigation water quality, endemic insect pests and diseases. Orchard health audits are conducted annually to compare and correlate the differences with the previous seasons for continual improvements.

శాశ్వతంగా రికార్డులు భద్రపరుచుట

సంహిత నందు రిజిస్టర్ కాబడిన ప్రతి తోట యొక్క పూర్తి వివరాలు మొదటినుండి పకడ్భందిగా భద్రపరచబడును. దీనివలన అటు తోట యజమానులకు, ఇటు సంహిత నిపుణులకు కూడా తోట యొక్క పూర్వాపరాలు ఎప్పుడంటే అప్పుడు తెలుసుకోవడానికి అవకాశముంటుంది. అలాగే సరైన సూచనలు ఇవ్వడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మార్కెటింగ్ లో తోడ్పాటు

బత్తాయి సాగులో నికర లాభాలు మార్కెట్ ధరలపై ఆధారపడి ఉంటాయి. సంహిత నందు రిజిస్టర్ ఐన రైతుల పంటలను మధ్యవర్తులు లేకుండా నేరుగా పరిశ్రమలకి, ఎగుమతిదారులకు పంపించే అవకాశాలు కల్పించబడును.